News

Home / News

డ్రాగన్​ఫ్రూట్​ సాగుతో యువరైతు అద్భుతాలు

07
MAR

డ్రాగన్​ఫ్రూట్​ సాగుతో యువరైతు అద్భుతాలు

'డ్రాగన్ఫ్రూట్ సాగుతో యువరైతు అద్భుతాలు'

వృత్తిపరంగా వైద్యుడైనప్పటికీ... వ్యవసాయంపై మక్కువతో కర్షకునిగా మారాడు. సాగులో ఆశ్చర్యకర ఫలితాలను సాధిస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ డ్రాగన్ ప్రూట్ దిగుబడి సాధించి పరిశోధకులనే ఔరా అనిపిస్తున్నాడు. సంగారెడ్డికి చెందిన ఆ యువరైతు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ కథనం చదవాల్సిందే...

మనదేశంలో సాగుచేయలేమన్న డ్రాగన్ఫ్రూట్ను పండించి వ్యవసాయ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యానికి గురి చేశాడు కూకట్పల్లికి చెందిన యువ వైద్యుడు శ్రీనివాస్ రావు. 2015లో తొలిసారి డ్రాగన్ప్రూట్ చూసి... ఆ పండు గురించి అంతర్జాలంలో శోధించి... దాని పౌష్టిక విలువలు, ఔషధ గుణాలు తెలుసుకున్నాడు.పట్టువదలని విక్రమార్కుడిలా శోధన...ఈ ఫ్రూట్ హవాయి, వియత్నాం, దక్షిణాఫ్రికాలో పెరుగుతుందని... మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో సాగవుతున్నట్లు శ్రీనివాస్రావు తెలుసుకున్నారు. మహారాష్ట్ర మొక్కలతో సంగారెడ్డి సమీపంలోని తన భూమిలో సాగు చేసినా ప్రయోజనం కలగలేదు. నిరాశ చెందకుండా విదేశాల్లో పర్యటించి డ్రాగన్ఫ్రూట్ సాగు విధానాలను నేర్చుకున్నారు.ప్రతికూల వాతావరణంలోనూ పండించేందుకు ప్రయోగాలు...వియత్నాం నుంచి విత్తనాలు తెచ్చి 2017లో తిరిగి సాగు ప్రారంభించారు. మేలైన పద్ధతులతో 8 నెలల్లోనే దిగుబడి పొందారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో పండే డ్రాగన్ఫ్రూట్ను ప్రతికూల వాతావరణంలోనూ పండించేందుకు ప్రయోగాలు చేసి విజయం సాధించారు.సీజన్లో రూ.150... ప్రస్తుతం రూ.400...ఏడాదిలో 365రోజులు డ్రాగన్ప్రూట్ పండేలా సాంకేతికత అభివృద్ధి చేశారు. ప్రతికూల వాతావరణంలోనూ పూర్తిస్థాయి దిగుబడి వస్తుందని... పండు పరిమాణం, రుచి సాధారణం కంటే ఎక్కువ ఉందని శ్రీనివాస్ రావు తెలిపారు. సీజన్లో కిలో రూ. 150 ఉండగా... ప్రస్తుతం రూ. 400 లకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని స్పష్టం చేశారు."అసలు డ్రాగన్ ఫ్రూట్ పండదు అన్న చోట తాను.. 365రోజులు పండించగలుగుతున్నానని శ్రీనివాస్ రావు ధీమాగా చెబుతున్నారు."

https://www.etvbharat.com/telugu/telangana/state/sangareddy/young-former-wonders-in-dragon-fruit-cultivation-at-his-farm-fields-in-sangareddy-district/ts20200303061036999
Only Available Deccanexotics dragonfruit farm Hyderabad

Check out the links below to follow Deccan exotics dragon fruit farm and research center...

Website:http://www.deccanexotics.com
https://twitter.com/DeccanExotics
https://www.facebook.com/dragonfruitf...
https://www.instagram.com/deccanexotics/
https://www.youtube.com/channel/UCcfBMk2L8rFoCRjVjpJ6d7w

Have any Question ?
Call Us :

(+91) 9704083000